ఆధ్యాత్మిక వైభవం.... పోలేరమ్మ జాతర
ఉ మ్మడి నెల్లూరు జిల్లా... నేటి తిరుపతి జిల్లాలో జరిగే విశిష్టమైన ఉత్సవాల్లో పోలేరమ్మ జాతర కూడా ఒకటి.... అమ్మా అని పిలిచినంతనే.... పలికే దేవతగా పోలేరమ్మ ప్రసిద్ధం.... పిలిచిన పలికే దేవతగా పూజలందుకుంటున్న అమ్మ వారికి సాంప్రదాయంగా ఏటా జరుపుకొనే జాతరే.... పోలేరమ్మ జాతర.... వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ జాతర 17వ శతాబ్ధం నుంచి జరుగుతున్న ఇప్పటికీ తన ప్రాశస్త్యాన్ని అలానే కొనసాగిస్తోంది.. 1717 వెంకటగిరి పట్టణంలో కలరా వ్యాప్తి చెందింది.. అప్పటి నుంచి రాజాలు శీతల యాగాన్ని జరిపించారు... అనంతరం అష్టదిగ్బంధనం చేసి యంత్రాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి పోలేరమ్మ జాతరను నిర్వహించారు..నాటి నుంచి జాతర నిర్విరామంగా ప్రతి యేడాది సాగుతోంది. వినాయక చవితి వెళ్లిన మూడవ బుధ , గురువారాల్లో అమ్మవారి జాతర జరుగుతోంది. వినాయక చవితి ముగిసిన తొలి బుధ వారం రాత్రి తొలి చాటింపు వేస్తారు. రెండు బుధవారం మలి చాటింపు వేస్తారు. ఈ చాటింపు బయటివారు విన్నా... చాటింపు తర్వాత గ్రామంలో నిదుర చేసినా వారు తప్పక జాతరలో పాల్గొనాల...