పోస్ట్‌లు

సెప్టెంబర్ 17, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

నారీ శక్తికి రిజర్వేషనా..?

చిత్రం
  స్త్రీ... ఈ అక్షరంలో విశ్వం... దాగుంది... త్రిగుణాత్మకమైన... ఈ రూపం... సాక్ష్యాత్తు అమ్మవారి స్వరూపమే...  కానీ మహిళను కేవలంగా చూసే... కొందరికి...  నారీశక్తి    గురించి  తెలియకపోవ డం..సహజం.. .    ఎక్కడైనా ఒకటి కన్నా ఎక్కువ పనులను చేసేవారిని బహుముఖ ప్రజ్ఞాశాలి.. అంటాం..  అలా చూస్తే ప్రతి మహిళా బహుముఖ ప్రజ్ఞాశాలే... ఉదయం లేచినప్పటి నుంచి కుటుంబాన్ని.. సమాజాన్ని సమైక్యంగా ... సమర్ధంగా నడిపిస్తూ ఉంటుంది.. పురుషుడు చేయలేని పనులను సైతం అవలీలగా చేసి.. శక్తికి మరో రూపంగా  నిలుస్తుంది..      అందుకే పురాణాల్లో అమ్మవారిని సర్వశక్తి స్వరూపంగా పూజిస్తారు.. సాక్ష్యాత్తు లోకపాలకులైన  త్రిమూర్తులకు జన్మని.. శక్తిని ఇచ్చిన అమ్మవారు జగజ్జనని అంటే ఆశ్చర్యం కాదు.... సాధారణ కుటుంబం నుంచి .. అసాధారణ కార్పొరేట్ కంపెనీల వరకు మహిళలు  సునాయాసంగా  నడపగలరు....    ఆకాశంలో సగమని అంటూనే.. మహిళలను అధః పాతాళానికి అణిచివేసేది పురుషజాతి..  తల్లిగా... చెల్లిగా... ప్రియురాలిగా... బిడ్డగా... స్నేహితురాలిగా.. ఎన్నో...

కర్తవ్యపథ్.......

చిత్రం
 140 కోట్ల భారతీయుల భవిష్యత్తు నిర్దేశమయ్యే నూతన ప్రాంగణం ప్రారంభమైంది..... కోట్లాదిమంది భారతీయులకు ప్రతినిధుల స్వరం ఈ భవనంలో ప్రతిధ్వనిస్తుంది ఇక్కడ చేసే వాద ..ప్రతివాదాలు.. నిర్ణయాలు.. సలహాలు.. సూచనలు.. శాసనాలు భారత భవిష్యత్తును నిర్ణయిస్తాయి..... ప్రతిక్షణం ప్రజాదనంతో ఇక్కడ సమావేశాలు సాగుతాయి. .....ప్రజల ఆశలకు.. ఆనందాలకు... భవిష్యత్తు భరోసా కు ఈ భవనమే వేదిక... ప్రధానమంత్రి మోడీ దార్శనికతకు  ఢిల్లీలోని సన్సాద్ మార్గ్ లోనిర్మితమైన   నూతన పార్లమెంట్ భవనం నిదర్శనం.....       భారతీయ చారిత్రక వైభవానికి ప్రతీకైనా సెంగోల్ చేత ధరించి మోడీ తొలి అడుగులు వేయగా యావత్ పార్లమెంటు సభా సదులంతా నూతన భవన ప్రాంగణంలోనికి ప్రవేశించారు. మోడీ తొలి పలుకులతో సభా ప్రాంగణం  మారు మ్రోగింది. భారతీయుల తలరాతను మార్చే నవశకానికి నూతన పార్లమెంట్ భవనంలో నాంది ప్రస్తావన జరిగింది. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోద ప్రస్తావనతో సభ ముందుకు సాగి భారతీయ సంప్రదాయాల్లో మహిళా ప్రాధాన్యాన్ని తెలియజెప్పింది.       షట్ద్వారాలతో నూతన పార్లమెంటు భవనం రూపుదిద్దుకుంది. హైం...

విశ్వ కేతనం.. శాంతినికేతనం.....

చిత్రం
  ప చ్చదనం పరిఢవిల్లే ప్రదేశం... పెద్ద పెద్ద వృక్షాల నీడన విద్యాభ్యాసం.. అడుగడునా.. జ్ఞాన లహరి.. ఆధ్యాత్మిక దొంతరలు... ఇవన్నీ నేటి సమాజంలో చూస్తే.. కాస్తంత విడ్డూరంగానే ఉంటుంది.. కానీ ఈ విహారం... ఆధ్మాత్మిక ప్రయాణం.. శాంతినికేతనంలో సర్వసాధారణం... ప్రతి అడుగు.. ప్రగతి మార్గాన్ని చూపుతుంది.. నేల మీద కనిపించే ప్రతి ఆకు నిన్నటి చరిత్ర స్పృశిస్తుంది.. అక్కడా గుంభనంగా సాగే..  పిల్ల తెమ్మెరలు కూడా... ఎన్నో కథలను.. వాటి సువాసనలను మోసుకుంటూ వెళుతూనే ఉంటాయి.... విజ్ఞానానికి ప్రతీకగా... విశ్వకవి రవీంద్రుని కలల జ్ఞాన పీఠంగా శాంతినికేతన్ నిలిచింది.. బెంగాల్ మణిమకుటంలో శాంతినికేతన్ ఓ కలికితురాయిగా మెరుస్తోందని మేధావులు భావిస్తారు.. భావిస్తూనే ఉన్నారు..  అంతటి గొప్ప శాంతినికేతన్ కు యునెస్కో గుర్తింపు లభించడం బంగారానికి తావి అబ్బడం లాంటిదే..          అసలు ఏంటీ శాంతి నికేతన్..?  ఎంతో మంది పెద్దలు చెబుతుంటారు.. ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా చూడాలని విశ్వకవి రవీంద్రుని కవితలు చదివిన వారి భావన.. ఎంతో మందికి అందని కలలా నిలిచే ఈ అపురూప ప్రదేశం... నేడు ప్రపంచ వారసత...