నారీ శక్తికి రిజర్వేషనా..?

 


స్త్రీ... ఈ అక్షరంలో విశ్వం... దాగుంది... త్రిగుణాత్మకమైన... ఈ రూపం... సాక్ష్యాత్తు అమ్మవారి స్వరూపమే...  కానీ మహిళను కేవలంగా చూసే... కొందరికి...  నారీశక్తి  గురించి తెలియకపోవడం..సహజం...

   ఎక్కడైనా ఒకటి కన్నా ఎక్కువ పనులను చేసేవారిని బహుముఖ ప్రజ్ఞాశాలి.. అంటాం.. 
అలా చూస్తే ప్రతి మహిళా బహుముఖ ప్రజ్ఞాశాలే... ఉదయం లేచినప్పటి నుంచి కుటుంబాన్ని.. సమాజాన్ని సమైక్యంగా ... సమర్ధంగా నడిపిస్తూ ఉంటుంది.. పురుషుడు చేయలేని పనులను సైతం అవలీలగా చేసి.. శక్తికి మరో రూపంగా  నిలుస్తుంది..


     అందుకే పురాణాల్లో అమ్మవారిని సర్వశక్తి స్వరూపంగా పూజిస్తారు.. సాక్ష్యాత్తు లోకపాలకులైన 
త్రిమూర్తులకు జన్మని.. శక్తిని ఇచ్చిన అమ్మవారు జగజ్జనని అంటే ఆశ్చర్యం కాదు....
సాధారణ కుటుంబం నుంచి .. అసాధారణ కార్పొరేట్ కంపెనీల వరకు మహిళలు  సునాయాసంగా 
నడపగలరు....

   ఆకాశంలో సగమని అంటూనే.. మహిళలను అధః పాతాళానికి అణిచివేసేది పురుషజాతి.. 
తల్లిగా... చెల్లిగా... ప్రియురాలిగా... బిడ్డగా... స్నేహితురాలిగా.. ఎన్నో బాధ్యతలను మోసే పడతి..  
కేవలం వంటింటికే  పరిమితం అయ్యే స్థితి నుంచి..  ఆకాశ తీరాలను సైతం సునాయాసంగా  ఛేదించే స్థాయికి చేరింది...

              యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్రదేవతా.. అనేది ఆర్యోక్తి...

  దీని భావం ఎక్కడ మహిళ పూజించబడుతుందో.. అక్కడ దేవతలు సంతోషిస్తారని అర్ధం.. కానీ నేటి సమాజం ఆ ఆర్యోక్తి కి  భిన్నంగా  వెళుతోంది..

  మహిళలు పురుషులతో సమానం అని పేర్కొనే వారు సైతం.. తమ వరకు వచ్చే సరికి మహిళలను కాస్తంత తక్కువ సమానంగా చూస్తారనడంలో ఎటువంటి సందేహం ఉండదనుకుంటా.. 

   ఢిల్లీలో నూతనంగా ప్రారంభమైన కర్తవ్య పథ్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర పడింది..  ప్రస్తుతం లోక్ సభలో 542 మంది సభ్యులు ఉండగా.. 78 మంది మహిళలు ఉన్నారు. రాజ్యసభలో 224 మంది సభ్యులు ఉండగా.. 24 మంది మాత్రమే మహిళలు..

   మూడు దశాబ్దాలుగా నలుగుతున్న  మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. లోక్ సభ, రాష్ట్రాల శాసన సభల్లో 2029 ఎన్నికల నుంచి  అమలు కానుంది.  ఈ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందినా...2027లో జనగణన జరిగిన తర్వాత మాత్రమే అమలుకానుంది... జనగణన తర్వాత 239 ఏ ఏ, 330 ఏ, 332 ఏ నిబంధనల మేరకు లోక్ సభ , రాష్ట్ర శాసన సభ, దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు రిజర్వు చేసిన సీట్లు పార్లమెంట్ చట్టం ఆమోదంలో ఉన్నంత వరకు కొనసాగుతాయి...సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతీసారి సదరు రిజర్వుడు స్థానాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి...

అసలు నాకు అర్ధం కాని విషయం.. స్త్రీ లేని సమాజాన్ని ఊహించడం కష్టం.. కానీ రిజర్వేషన్  33 శాతం మాత్రమే....

అసలు మహిళలకు రిజర్వేషన్ కల్పించే స్థాయి  ఎవరిదో..... 

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కూడా వ్యతిరేక ఓటు వేశారంటే.... వారి ఆలోచనల్లో పురుషాధీక్యత స్థాయి ఎంత ఉందో అర్ధం అవుతుంది.

                                                                                      - విరించిక

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామ మార్గమే .. రామాయణం

ఆధ్యాత్మిక వైభవం.... పోలేరమ్మ జాతర

'మనోః' వాంఛ ఫల సిద్ధిరస్తు....!