రామ మార్గమే .. రామాయణం

శ్రీరామ రామ రామేతి 
రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం 
రామనామ వరాననే..


   ఈ శ్లోకాన్ని మూడు సార్లు  పఠించినంతనే... విష్ణు సహస్రనామ ఫలితం లభిస్తుందని పెద్దలు సూచిస్తారు. వాల్మికి 'మరా'.. శబ్దాన్ని మననం చేస్తుండగా.. రామశబ్ధం ఉద్భవించిందని నమ్మకం.. శ్రీరామ అని పలికినంతనే.. సర్వపాపాలు తొలగుతాయని.. విశ్వాసం..మానవుడిగా  జన్మించిన రాముడు.. వ్యక్తి ఎలా జీవించాలో.. రాజు ఎలా ఉండాలో.. సూచించిన మార్గమే... రామాయణం... ఈ పదాన్ని పూర్తిగా ఇలా రాయాలి... రామ ఆయనం... అంటే రాముని  ప్రయాణం అని..

       అయోధ్య రాజైన దశరథునికి కౌసల్య, సుమిత్ర, కైకయి అను ముగ్గురు భార్యలు .. వారి వల్ల కౌసల్యకు రాముడు,  సుమిత్రకు లక్ష్మణుడు, శతృఘ్నడు, కైకేయికి భరతుడు జన్మించారు.  సకల విద్యలో వారు ఆరితేరారు...
       విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం..ఆయన  వెంట రామలక్ష్మణులు వెళ్లి  తాటక సంహారం, సుబాహు వధ.. చేశారు.. మిథిలానగరంలో ఎందరో యోధల గర్వం సర్వాన్ని హరించిన..  శివధనుస్సును.. శ్రీరాముడు యోగ్యతతో విరిచాడు..  జనక పుత్రి జానకిని గురువు.. తండ్రి అనుమతితో వివాహం చేసుకున్నాడు..

 రామునికి పట్టాభిషేకం చేయాలని దశరథుడు  నిర్ణయించాడు.. ఈ మేరకు ఉత్సవాలకు ఏర్పాట్లు   చేయించాడు.. రాముని రాజ్యాభిషేకాన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి..  మంధర మాట విని కైకేయి.. దశరథుడిపై ఒత్తిడి తెచ్చి... రాముడిని సీతాసమేతంగా 14 ఏళ్లపాటు వనవాసానికి పంపింది... అన్న పై ప్రేమతో లక్ష్మణుడు కూడా వనాలకు కదిలాడు.. 
  వాలిని సంహరించాడు.. వానరాల సాయంతో సీతాన్వేషణ సాగించాడు. ఎన్నో కష్టాలను అధిగమించి.. హనుమంతుడు లంకలో సీత జాడను గుర్తించి.. రాముని ఉంగాన్ని గుర్తుగా ఇచ్చాడు..  లంకా దహనం చేసి.. రాక్షస సంహారం చేశాడు.. తిరిగి కిష్కిందకు చేరుకుని రామునికి శుభవార్త తెలిపాడు.. శుభ ముహూర్తంలో సముద్రంపై వానరుల సాయంలో రాముడు వారధి కట్టి లంకా రాజ్యాన్ని చేరాడు.. 

    అడవిలో సూర్పణక రాముని వలచింది.. దీంతో ఆగ్రహించిన లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు.. బాధపడిన సూర్పణక... తన సోదరులు  ఖరదూషణాదులను రామునిపైకి పంపింది.. వారిని రాముడు ఓడించాడు.. ఇక తప్పదని... సూర్పణక తన పెద్దన్న  రావణుడికి ఫిర్యాదు చేసింది.. 

రావణాసురుడు ఆగ్రహించి.. మారీచుడనే రాక్షసుడిని  బంగారు లేడిగా పంపి.. తాను మాయారూపంలో వచ్చి  సీతను అపహరించాడు.. సీత కోసం రాముడు సుగ్రీవునితో స్నేహం చేశాడు..

   రావణ కుంభకర్ణులను హతం చేశాడు.. సీతకు అగ్ని పరీక్ష నిర్వహించి.. పుష్పక విమానంలో అయోధ్య చేరాడు.. పట్టాభిషిక్తుడే.. 
రామరాజ్యాన్నిస్థాపించాడు.. 

ఇది వాల్మీకి బోధించిన రామాయణం కట్టె.. కొట్టె.. తెచ్చే రీతిలో .... 

    రాముని విషయం సాధారణంగా ఇలా ఉంటే.. ఆధ్యాత్మికంగా చూస్తే... నిత్యం ధ్యానంలో ఉండే లయకారుడు.. నిత్యం స్మరించే రూపం శ్రీరామునిది.. మర్యాదా పురుషోత్తమునిగా.. పితృవాక్య పరిపాలకునిగా.. బిడ్డగా, సోదరునిగా, భర్తగా స్నేహితునిగా, స్వామిగా, రాజుగా ప్రజల మనస్సుల్లో నిత్యం నిలిచిపోయిన మహారాజు శ్రీరాముడు.. మహావిష్ణువు ఏడవ అవతారంగా శ్రీరామునిగా జన్మించాడు.. ఉగాది పర్వదినం వచ్చిన తొమ్మిదవ రోజున  శ్రీరామ జననం జరిగిందని రామాయణం చెబుతుంది. చైత్రమాసం నవమి రోజు జన్మించాడు.. కొన్ని తిథులు మంచివికావనే మూఢ నమ్మకాన్ని.. బద్దలు చేస్తూ..   దేవుళ్లు ... అష్టమి, నవమి తిథుల్లో పుట్టి.. ప్రజల్లోని మూఢ విశ్వాసానికి మంగళం పలికారు.. 

     పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైన వేళ అడవులకు వెళ్లాలని తండ్రి ఆదేశిస్తే.. మారు మాట్లాడకుండా.. కానలకు వెళ్లడం రాముని పితృవాక్య పరిపాలనకు నిదర్శనం.. కైకేయి.. తన బిడ్డ భరతునికి రాజ్యాభిషేకం చేయాలని సంకల్పించిన విషయం తెలిసినా.. చిరునవ్వుతో అయోధ్యను వీడిన ధీరుడు రాముడు.. తన వెంట వచ్చిన సోదరుడిపై ప్రేమను చూపుతూ.. తన వెంట రాని సోదరులైన భరతుడు, శతృఘ్నుల పట్ల సమానమైన అభిమానాన్ని చూపిన భాతృప్రేమ సముపార్జితుడు. శివధనుర్భంగం చేసి.. సీతాదేవిని చేపట్టి.. నాటి నుంచి భర్తగా.. భార్య మనస్సుల్లో స్థానం పొందిన ధీరుడు.. రాముడు....... వానరుడైన సుగ్రీవునితో స్నేహం చేసి.. అతనికి కిష్కింద రాజ్యాన్ని కట్టబెట్టిన పోటరి... ఆంజనేయునితో మితృత్వం చేసి.. అతని భక్తికి స్వామిగా మారిన దేవుడు.. రాముడు.. అయోధ్య రాజ్యాన్ని సకల లోకాలు ప్రశంసించే విధంగా పాలించి.. సకల లోకాలకు రామరాజ్య స్థాపన విశేషాన్ని వివరించిన రాజు.. రాముడు..
   శ్రీరామ నవమి పర్వదినం.. రామాయణం ప్రకారం.. దశరథునికి , కౌసల్యకి రాముడు పుట్టిన రోజు...  మిథిలానగర చక్రవర్తి జనకుని కుమార్తె... జానకిని చేపట్టిన రోజు నవమినాడే... కనుకనే శ్రీరామ నవమిని రామజననం... స్వామివారి కల్యాణం జరుపుకోవడం ఆనవాయితీ.. 
                                                                                                                      - విరించిక...

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'మనోః' వాంఛ ఫల సిద్ధిరస్తు....!

ఆధ్యాత్మిక వైభవం.... పోలేరమ్మ జాతర