పోస్ట్‌లు

సెప్టెంబర్ 24, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

మార్పు .....

చిత్రం
   మార్పు సహజం ...... అవసరం....... అంతెందుకు ఈ సృష్టిలోని ప్రతిదీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది... మార్పు లేకుంటే ఈనాడు మనం మనుషులుగా పరిణామం చెందుండే వాళ్ళమే కాదు....    బిగ్ బ్యాంగ్ థియరీ ... గొప్ప అణు విస్పోటనం తో లక్షల ఏళ్ల తరబడి మండుతున్న భూమి చల్లబడి జీవానికి మార్గం చూపింది..ఏక కణ జీవి నుంచి డైనోసోర్‌ వరకు ఎన్నింటికో ఆటపట్టైంది..మానవ పరిణామ క్రమం కూడా మార్పు చెందింది.ఆదిమానవుడు, నుండి ఆధునిక మానవుడిగా పరిణామం చెందటంలో ఎంత గొప్ప మార్పు ఉందో చూడొచ్చు.  ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా అభివృద్ధి చెందడానికి మొదట గుడ్డుగా జన్మించి లార్వ, ప్యూపా దశలను దాటి  సీతాకోకచిలుకగా  పరిణతి చెందుతుంది. మనిషిలోను అంతే..... ఒక మనిషి సాధారణ మానవుడి నుండి అభివృద్ధి చెందిన ఉన్నతమైన మానవుడిగా ఎదగడానికి ఎన్నో ఒడిదుడుకులను  ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో ఒక్కొక్క  స్టేజీను దాటుకుంటూ జయాపజయాలను అధిగమిస్తూ వాటిలోని సారాంశాన్ని తీసుకుని ముందుకు సాగిన నాడే పరిపూర్ణ మానవుడిగా కీర్తి గడిస్తాడు ...     మనిషిలో మార్పు లేకుంటే అమ్మ కడుపులో అండంలాగే ఉండి పోయే ...

నేటి విద్యార్థి...

చిత్రం
అక్షరం కంప్యూటర్ కి ఎక్కింది ..... భావం అడుగుకి చేరింది ...... అక్షరాల వ్యవసాయంలో   సారం తగ్గి అర్ధాలు మారాయి...  యూట్యూబ్ వీడియోలతో  అక్షరాల నడకల్లో తేడాలొచ్చాయి...... చిన్న వీడియోల మోజులో  అక్షరం పై ప్రేమ తగ్గింది......  ఇన్స్టా నవ్వులు, ట్విట్టర్ కూతలు, రీల్స్ నడకలతో చదువు పెట్టెలో చేరింది......  కే డ్రామాల సాగతీతలతో  మానవ సంబంధాలు అటకెక్కుతున్నాయి...... - విరించిక

'మనోః' వాంఛ ఫల సిద్ధిరస్తు....!

చిత్రం
                 "Mind.... the world's greatest weapon" జ లాన్ని మేఘాలు ఆకర్షిస్తాయి. కొండలు వృక్షాలు మేఘాలను ఆకర్షిస్తాయి. మేఘాలు వర్షిస్తే ప్రతి చిరుకును భూమి ఆకర్షిస్తుంది. పుడమి చేరిన నీటి చుక్క మట్టికి పదును పెంచి మొక్కలు వృక్షాలు పెరిగేలా చేస్తుంది. ఇది ఒక ప్రాకృతిక ధర్మం.... వీటి ధర్మాలు వేరుగా ఉన్నా అన్నింటిలో సాధారణంగా కనిపించేది ఆకర్షణ.. ఆ ఆకర్షణకు విశ్వాన్ని నడిపించే శక్తి ఉంది. అందుకే ఏ ఆధారం లేకుండా విశ్వం శూన్యంలో స్థిరంగా ఉంది. ఈ భావనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆకర్షణ ప్రతి దగ్గర తన శక్తిని చూపుతూనే ఉంటుంది.   ప్రకృతైన.. జీవజాలమైన.. ఈ ఆకర్షణకు లోబడే జీవనయానాన్ని సాగిస్తూ ఉంటాయి.      సమాజంలో ఉండే జీవరాశులన్నింటిలోనూ బ్రతికేందుకు అవసరమైన తెలివితేటలు ఉన్నాయి.  తన ఆహారం కోసం జింక కన్నా వేగంగా చిరుత పరిగెత్తితే.... తన ప్రాణం కోసం జింక మెరుపు వేగాన్ని చూపుతుంది. చిరుత , జింకల్లోని ఆ వేగం ఎక్కడి నుంచి వచ్చాయో ఆలోచిస్తే ఓ విషయంపై స్పష్టత వస్తుంది. అదే మేధస్సు.....     మనిషి సహజంగ...