నేటి విద్యార్థి...

అక్షరం కంప్యూటర్ కి ఎక్కింది .....

భావం అడుగుకి చేరింది ......

అక్షరాల వ్యవసాయంలో  

సారం తగ్గి అర్ధాలు మారాయి... 

యూట్యూబ్ వీడియోలతో 

అక్షరాల నడకల్లో తేడాలొచ్చాయి......

చిన్న వీడియోల మోజులో 

అక్షరం పై ప్రేమ తగ్గింది...... 

ఇన్స్టా నవ్వులు, ట్విట్టర్ కూతలు,

రీల్స్ నడకలతో చదువు పెట్టెలో చేరింది...... 

కే డ్రామాల సాగతీతలతో 

మానవ సంబంధాలు అటకెక్కుతున్నాయి......



- విరించిక


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామ మార్గమే .. రామాయణం

ఆధ్యాత్మిక వైభవం.... పోలేరమ్మ జాతర

'మనోః' వాంఛ ఫల సిద్ధిరస్తు....!