మార్పు .....
మార్పు సహజం ...... అవసరం....... అంతెందుకు ఈ సృష్టిలోని ప్రతిదీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది... మార్పు లేకుంటే ఈనాడు మనం మనుషులుగా పరిణామం చెందుండే వాళ్ళమే కాదు....
బిగ్ బ్యాంగ్ థియరీ ... గొప్ప అణు విస్పోటనం తో లక్షల ఏళ్ల తరబడి మండుతున్న భూమి చల్లబడి జీవానికి మార్గం చూపింది..ఏక కణ జీవి నుంచి డైనోసోర్ వరకు ఎన్నింటికో ఆటపట్టైంది..మానవ పరిణామ క్రమం కూడా మార్పు చెందింది.ఆదిమానవుడు, నుండి ఆధునిక మానవుడిగా పరిణామం చెందటంలో ఎంత గొప్ప మార్పు ఉందో చూడొచ్చు.
ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా అభివృద్ధి చెందడానికి మొదట గుడ్డుగా జన్మించి లార్వ, ప్యూపా దశలను దాటి సీతాకోకచిలుకగా పరిణతి చెందుతుంది. మనిషిలోను అంతే..... ఒక మనిషి సాధారణ మానవుడి నుండి అభివృద్ధి చెందిన ఉన్నతమైన మానవుడిగా ఎదగడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో ఒక్కొక్క స్టేజీను దాటుకుంటూ జయాపజయాలను అధిగమిస్తూ వాటిలోని సారాంశాన్ని తీసుకుని ముందుకు సాగిన నాడే పరిపూర్ణ మానవుడిగా కీర్తి గడిస్తాడు ...
మనిషిలో మార్పు లేకుంటే అమ్మ కడుపులో అండంలాగే ఉండి పోయే వాడు ......మెదడులోని మేధస్సు అభివృద్ధిని కోరుకుంటుంది. మనిషిలోని ఈ మెదడు నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవాలని కుతూహలపడుతుంది. తెలుసుకున్న ఈ విషయాలను మంచిగా వాడుకుంటే తనతో పాటు చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి చెందుతుంది. వచ్చిన మార్పు ఎప్పుడు అభివృద్ధికి చిహ్నంగా ఉండాలి తప్ప మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజానికి హాని కల్పించేలా మనల్ని పాతాళంలోకి నెట్టేలా ఉండకూడదు.
మనిషిలోని మనసు సున్నితంగా ఉంటుంది. ప్రతి చిరు విషయాలకు మనస్సు స్పందిస్తుంది. మన మేధస్సుకు మనం బందీ అవచ్చు .... ఇది మన అభివృద్ధినే కోరుకుంటుంది .. కానీ మన మనసును మాత్రం మనం అదుపులో పెట్టుకోకపోతే మనం దానికి బందీగా మారాల్సి వస్తుంది. అప్పుడు వచ్చే ఫలితాలు మనం సమాజంలో చూస్తూనే ఉంటాం..
టెక్నాలజీ పరంగా చూస్తే టెలిఫోన్ల నుంచి నేడు శాటిలైట్ ఫోన్ ల వరకు నోకియా నుంచి ఐఫోన్ వరకు ఎంతలా అభివృద్ధి చెందిందో చూశాం. అలానే ప్లే గ్రౌండ్ లో ఆడుకునే పిల్లలు నేడు ఈ ఫోన్లు కార్టూన్లు మోజులో పడి చదువులని అటకెక్కించి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తున్నాం..
మార్పు ఎప్పుడూ మంచికే ఉండాలి అనుకోవడంలో తప్పులేదు కానీ ... ఉండేలా మన వంతు కృషిని కూడా చేయాలి. రాత్రివేళ చుక్కల మధ్యలో అందమైన తెల్లని రూపాన్ని చూసి చందమామగా ప్రేమగా పిలుచుకునేవాళ్లం..అందమైన అమ్మాయిల్ని కూడా చంద్రబింబం వలే ఎంత చక్కగా ఉందని వర్ణించేవాళ్ళం.. కానీ నేడు చంద్రుని మీదకు రాకెట్లు పంపించి,చంద్ర మండలాన్ని శోధించడం వరకూ వచ్చాం... ఇంత మార్పును ఊహించామా...! మార్పు నిరంతరం ప్రక్రియ కొన్ని మంచికి ఉపయోగపడితే కొన్ని చెడును ప్రోత్సహిస్తాయి..కానీ అందులో సారాంశాన్ని గ్రహించి ఉన్నత స్థాయికి చేరడమే మన విజ్ఞత.....
సున్నితత్వం.. సహజత్వం.. అనేవి సాధారణంగా ఉండేవి..కానీ మార్పు మాత్రం కాస్తంత తీవ్రంగా ఉంటుంది.. పరిస్థితుల్లో కలిగే అసాధారణ స్థితోనే మార్పు సంభవిస్తుంది.. ఆల్చిప్పల్లోకి నీరు చేరి... అక్కడ పరిస్థితిని తారుమారు చేస్తేనే... అందమైన ముత్యం బయటకు వస్తుంది.. అప్పుడే మార్పుకు అర్ధం ఉంటుంది... ప్రపంచంలో ఎప్పుడైనా.. మార్పు రానిది... మార్పు ఒక్కటే... నిరంతరం మారుతూ ఉండేది.. కూడా మార్పే.. అందుకే మార్పు అందరికీ ఆహ్వానించ దగిన పరిణామం......
- విరించిక
.jpg)


.jpg)
.jpg)
Change is Revolution 👍
రిప్లయితొలగించండి