'మనోః' వాంఛ ఫల సిద్ధిరస్తు....!

                "Mind.... the world's greatest weapon"

లాన్ని మేఘాలు ఆకర్షిస్తాయి. కొండలు వృక్షాలు మేఘాలను ఆకర్షిస్తాయి. మేఘాలు వర్షిస్తే ప్రతి చిరుకును భూమి ఆకర్షిస్తుంది. పుడమి చేరిన నీటి చుక్క మట్టికి పదును పెంచి మొక్కలు వృక్షాలు పెరిగేలా చేస్తుంది. ఇది ఒక ప్రాకృతిక ధర్మం.... వీటి ధర్మాలు వేరుగా ఉన్నా అన్నింటిలో సాధారణంగా కనిపించేది ఆకర్షణ.. ఆ ఆకర్షణకు విశ్వాన్ని నడిపించే శక్తి ఉంది. అందుకే ఏ ఆధారం లేకుండా విశ్వం శూన్యంలో స్థిరంగా ఉంది. ఈ భావనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆకర్షణ ప్రతి దగ్గర తన శక్తిని చూపుతూనే ఉంటుంది.  ప్రకృతైన..జీవజాలమైన.. ఈ ఆకర్షణకు లోబడే జీవనయానాన్ని సాగిస్తూ ఉంటాయి.

     సమాజంలో ఉండే జీవరాశులన్నింటిలోనూ బ్రతికేందుకు అవసరమైన తెలివితేటలు ఉన్నాయి.  తన ఆహారం కోసం జింక కన్నా వేగంగా చిరుత పరిగెత్తితే.... తన ప్రాణం కోసం జింక మెరుపు వేగాన్ని చూపుతుంది. చిరుత , జింకల్లోని ఆ వేగం ఎక్కడి నుంచి వచ్చాయో ఆలోచిస్తే ఓ విషయంపై స్పష్టత వస్తుంది. అదే మేధస్సు.....

    మనిషి సహజంగా శారీరకంగా బలహీనుడు... చిరుత వంటి వేగం.. ఏనుగు వంటి బలం.. ఎలుక వంటి గ్రహణ శక్తి.. డేగ వంటి చూపు..  తనకి లేకపోయినా మేదస్సుతో సృష్టిపై ఆధిపత్యాన్ని చలాయించగలుగుతున్నాడు మనిషి.. 

    మెదడు పలు ఆలోచనలకు కేంద్రం ఆ ఆలోచనలలోతు ఎంత ఉంటుందంటే సముద్రపు లోతు సైతం ఈ లోతుకు సరికాదు. ప్రతిరోజూ సహజంగా జరిగే ప్రక్రియలు అన్నింటికీ మెదడు స్వతః సిద్దంగా స్పందిస్తుంది.

    మనిషి ఆశలు ఎంతో గంభీరంగా ఉంటాయి. ఆ ఆశలను తీర్చుకునేందుకు ఒక్కోసారి ఎంతగానో ప్రయత్నించాల్సి ఉంటుంది. కొందరికి పెద్దపెద్ద ఆశలు ఇట్టే తీరిపోతాయి. అవి ఎలా సాధ్యం..? ప్రతి ఒక్కరి మెదడులో నిగూఢంగా రెండు పొరలు ఉంటాయి. ఒకటి..రోజువారీ వ్యవహారాల ఆలోచనలకు తగినట్టుగా పనిచేస్తే...  మరొకటి అంతర్లీనంగా ఉంటుంది. ఇదే సబ్ కాన్షియస్ మైండ్.. ప్రతి వ్యక్తిలోనూ ఇది ఉంటుంది. చిన్ననాటి నుండి తన ఆలోచనలు, ఆశలు అంతర్లీనంగా ఉండిపోవడంతో సబ్ కాన్షియస్ మైండ్ లో నిలిచిపోతాయి.


      సబ్ కాన్షియస్ మైండ్ కి, విశ్వానికి ఎంతో అనుకూల సంబంధాలు ఉంటాయి. మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే అట్టే జరిగిపోతుంది. దీనికి కారణం అనుకూల విశ్వాసం... సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏదైనా తీవ్రంగా కోరుకొని ఆ విషయాన్ని ప్రకృతికి తెలియజేస్తే ప్రకృతి స్పందించి మన అంతర్లీన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది. 

     సాధారణంగా ఏదైనా ఒక వస్తువును, ఒక వాహనాన్ని, ఒక వ్యక్తిని ఇష్టపడితే ఇష్టం స్థాయిని బట్టి దాదాపుగా ఆయా వస్తువులు లేదా వాహనాలు కనిపిస్తూనే ఉంటాయి. నిత్యజీవనంలో అవి ఉన్నప్పటికీ సబ్ కాన్షియస్ మైండ్ శక్తి వల్ల మన కంటికి అవి ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. దీనిని గుర్తించవచ్చు.... అయితే వాటిని మనం సొంతం చేసుకోవాలనే ఆలోచన కోరిక ఎంత తీవ్రంగా ఉంటే మన కోరికలు అంత త్వరగా తీరేలా ప్రకృతి సహకరిస్తుంది. వీటన్నింటికీ నడుమ ఉండేది ఆకర్షణ దీనిని గుర్తించగలిగినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ కి  విశ్వానికి మధ్య ఆకర్షణను ప్రేరేపిస్తే చాలు...  దీనికి చేయవలసిందల్లా బలంగా కోరుకోవడమే......!

                                                                                                              -  విరించిక

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామ మార్గమే .. రామాయణం

ఆధ్యాత్మిక వైభవం.... పోలేరమ్మ జాతర