పోస్ట్‌లు

అక్టోబర్ 1, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆధ్యాత్మిక వైభవం.... పోలేరమ్మ జాతర

చిత్రం
ఉ మ్మడి నెల్లూరు జిల్లా... నేటి తిరుపతి జిల్లాలో జరిగే విశిష్టమైన ఉత్సవాల్లో  పోలేరమ్మ జాతర కూడా ఒకటి.... అమ్మా అని పిలిచినంతనే.... పలికే దేవతగా పోలేరమ్మ ప్రసిద్ధం.... పిలిచిన ప‌లికే దేవ‌త‌గా పూజ‌లందుకుంటున్న అమ్మ‌ వారికి సాంప్ర‌దాయంగా ఏటా జరుపుకొనే జాతరే....  పోలేరమ్మ జాతర.... వెంక‌ట‌గిరి గ్రామ శ‌క్తి పోలేర‌మ్మ జాత‌ర 17వ శ‌తాబ్ధం నుంచి జ‌రుగుతున్న ఇప్ప‌టికీ  త‌న ప్రాశ‌స్త్యాన్ని అలానే కొన‌సాగిస్తోంది.. 1717  వెంకటగిరి పట్టణంలో కలరా వ్యాప్తి చెందింది..  అప్పటి నుంచి రాజాలు శీతల యాగాన్ని జరిపించారు... అనంతరం అష్టదిగ్బంధనం చేసి  యంత్రాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి పోలేరమ్మ జాతరను నిర్వహించారు..నాటి నుంచి  జాతర నిర్విరామంగా ప్రతి యేడాది సాగుతోంది.   వినాయక చవితి వెళ్లిన మూడవ బుధ , గురువారాల్లో అమ్మవారి జాతర జరుగుతోంది.  వినాయక చవితి ముగిసిన తొలి బుధ వారం రాత్రి తొలి చాటింపు వేస్తారు.  రెండు బుధవారం  మలి చాటింపు వేస్తారు. ఈ చాటింపు బయటివారు విన్నా... చాటింపు తర్వాత గ్రామంలో నిదుర  చేసినా వారు తప్పక జాతరలో పాల్గొనాల...

రామ మార్గమే .. రామాయణం

చిత్రం
శ్రీరామ రామ రామేతి  రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం  రామనామ వరాననే..    ఈ శ్లోకాన్ని మూడు సార్లు  పఠించినంతనే... విష్ణు సహస్రనామ ఫలితం లభిస్తుందని  పెద్దలు సూచిస్తారు. వాల్మికి 'మరా'.. శబ్దాన్ని మననం చేస్తుండగా.. రామశబ్ధం ఉద్భవించిందని  నమ్మకం.. శ్రీరామ అని పలికినంతనే.. సర్వపాపాలు తొలగుతాయని..  విశ్వాసం.. మానవుడిగా    జన్మించిన రాముడు.. వ్యక్తి ఎలా జీవించాలో.. రాజు ఎలా ఉండాలో.. సూచించిన  మార్గమే...  రామాయణం...  ఈ పదాన్ని పూర్తిగా ఇలా రాయాలి... రామ ఆయనం... అంటే రాముని   ప్రయాణం అని..        అయోధ్య రాజైన దశరథునికి కౌసల్య, సుమిత్ర, కైకయి అను ముగ్గురు భార్యలు .. వారి వల్ల కౌసల్యకు రాముడు,  సుమిత్రకు లక్ష్మణుడు, శతృఘ్నడు, కైకేయికి భరతుడు జన్మించారు.  సకల విద్యలో వారు ఆరితేరారు...        విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం..ఆయన  వెంట రామలక్ష్మణులు వెళ్లి  తాటక సంహారం, సుబాహు వధ.. చేశారు.. మిథిలానగరంలో ఎందరో యోధల గర్వం సర్వాన్ని హరించిన..  శ...