కర్తవ్యపథ్.......

 140 కోట్ల భారతీయుల భవిష్యత్తు నిర్దేశమయ్యే నూతన ప్రాంగణం ప్రారంభమైంది..... కోట్లాదిమంది భారతీయులకు ప్రతినిధుల స్వరం ఈ భవనంలో ప్రతిధ్వనిస్తుంది ఇక్కడ చేసే వాద ..ప్రతివాదాలు.. నిర్ణయాలు.. సలహాలు.. సూచనలు.. శాసనాలు భారత భవిష్యత్తును నిర్ణయిస్తాయి..... ప్రతిక్షణం ప్రజాదనంతో ఇక్కడ సమావేశాలు సాగుతాయి. .....ప్రజల ఆశలకు.. ఆనందాలకు... భవిష్యత్తు భరోసా కు ఈ భవనమే వేదిక... ప్రధానమంత్రి మోడీ దార్శనికతకు  ఢిల్లీలోని సన్సాద్ మార్గ్ లోనిర్మితమైన   నూతన పార్లమెంట్ భవనం నిదర్శనం.....


      భారతీయ చారిత్రక వైభవానికి ప్రతీకైనా సెంగోల్ చేత ధరించి మోడీ తొలి అడుగులు వేయగా యావత్ పార్లమెంటు సభా సదులంతా నూతన భవన ప్రాంగణంలోనికి ప్రవేశించారు. మోడీ తొలి పలుకులతో సభా ప్రాంగణం  మారు మ్రోగింది. భారతీయుల తలరాతను మార్చే నవశకానికి నూతన పార్లమెంట్ భవనంలో నాంది ప్రస్తావన జరిగింది. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోద ప్రస్తావనతో సభ ముందుకు సాగి భారతీయ సంప్రదాయాల్లో మహిళా ప్రాధాన్యాన్ని తెలియజెప్పింది.

      షట్ద్వారాలతో నూతన పార్లమెంటు భవనం రూపుదిద్దుకుంది. హైందవ  ఆధ్యాత్మికత వెల్లి వెరిసేలా మానవ జీవనంలో పెనవేసుకుపోయిన పలు జీవరాసుల పేర్లతో ద్వారాలకు నామకరణాలు చేశారు.

1. గజద్వారం......జ్ఞానం వివేకం సంపదలకు ప్రతీకగా గజద్వారాన్ని ఏర్పాటు చేశారు.... 

2.అశ్వద్వారం ...... శక్తికి ధైర్యానికి అధికారానికి ప్రతీకగా అశ్వద్వారాన్ని నిర్మించారు. అదే స్థాయిలో పరిపాలన సాగాలని ద్వార నిర్మాణశైలి జరిగింది..

3. గరుడద్వారం...... తూర్పు ద్వారానికి గరుడద్వారమని నామకరణం చేశారు. హిందూ ధర్మ పురాణాల ప్రకారం మహావిష్ణువు వాహనం గరుడుడు..... దేవదేవుడు అధిష్టించిన  పక్షీంద్రుడు ధర్మానికి శక్తికి నిర్వచనం. 

4.మకరద్వారం.......బహువిధ జీవరాసుల సమైక్యతకు సూచిక మకర ద్వారం.మొసలి హైందవ బౌద్ధ సంప్రదాయాల్లో శక్తివంతమైన మకరానికి ప్రత్యేక స్థానం ఉంది. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ ద్వారం నిదర్శనం. 

5.శార్దూలద్వారం......సింహ శరీరానికి గజ...... అశ్వ...... శుక ......శిరస్సులు కలిగిన రూపం శార్దూలం ప్రజాశక్తికి ఈ రూపాన్ని దర్పణంగా నిలిపారు.

6. హంసద్వారం...... చదువుల తల్లి సరస్వతి దేవి వాహనం హంస జనన మరణాల చట్టం నుంచి ఆత్మకు విముక్తి కలిగించే మోక్షదాయని హంస..... విజ్ఞానానికి ఆత్మ పరిశీలనకు స్ఫూర్తిగా ఈ ద్వారాన్ని నిర్మించారు. 

     భారత స్వాతంత్ర్య వజోత్సవ వేడుకలకు నిదర్శనంగా 75 రూపాయల   నాణాన్ని  మోడీ ఆవిష్కరించారు.  వజ్రోత్సవ కాలం నుంచి అమృత కాలానికి సాగుతున్న వేళ నూతన పార్లమెంటు భవనం భారతావని అభ్యున్నతికి మలిమెట్టుగా మారింది.

    G20 శిఖరాగ్ర సదస్సుకు భారత వేదిక అయిన సమయంలో నూతన పార్లమెంట్ భవనం ప్రత్యేకతను సంతరించుకుంది.ఇతర దేశాలకు సుహృద్భావ సందేశాలను ఇస్తూనే మరోవైపు శత్రుదేశాల గుండెల్లో చిరుచేమటలు పట్టిస్తోంది....

    నవభారత నిర్మాణానికి సమస్త ప్రజా భవిష్యత్తు నిర్దేశానికి ఈ స్థానం సుస్థిరం కానుంది. అమృతకాలం ప్రవేశించనున్న వేళ ప్రతిపాతం అమృతమయమయ్యేలా ప్రపంచ పటంపై భారత స్థానం చిరస్థాయిగా నిలిచేలా ఈ భవనం  రూపు దాల్చాలని ఆకాంక్షిస్తూ .....

                                                                                                        - విరించిక

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామ మార్గమే .. రామాయణం

ఆధ్యాత్మిక వైభవం.... పోలేరమ్మ జాతర

'మనోః' వాంఛ ఫల సిద్ధిరస్తు....!