విశ్వ కేతనం.. శాంతినికేతనం.....
పచ్చదనం పరిఢవిల్లే ప్రదేశం... పెద్ద పెద్ద వృక్షాల నీడన విద్యాభ్యాసం.. అడుగడునా.. జ్ఞాన లహరి.. ఆధ్యాత్మిక దొంతరలు... ఇవన్నీ నేటి సమాజంలో చూస్తే.. కాస్తంత విడ్డూరంగానే ఉంటుంది.. కానీ ఈ విహారం... ఆధ్మాత్మిక ప్రయాణం.. శాంతినికేతనంలో సర్వసాధారణం... ప్రతి అడుగు.. ప్రగతి మార్గాన్ని చూపుతుంది.. నేల మీద కనిపించే ప్రతి ఆకు నిన్నటి చరిత్ర స్పృశిస్తుంది.. అక్కడా గుంభనంగా సాగే.. పిల్ల తెమ్మెరలు కూడా... ఎన్నో కథలను.. వాటి సువాసనలను మోసుకుంటూ వెళుతూనే ఉంటాయి.... విజ్ఞానానికి ప్రతీకగా... విశ్వకవి రవీంద్రుని కలల జ్ఞాన పీఠంగా శాంతినికేతన్ నిలిచింది.. బెంగాల్ మణిమకుటంలో శాంతినికేతన్ ఓ కలికితురాయిగా మెరుస్తోందని మేధావులు భావిస్తారు.. భావిస్తూనే ఉన్నారు.. అంతటి గొప్ప శాంతినికేతన్ కు యునెస్కో గుర్తింపు లభించడం బంగారానికి తావి అబ్బడం లాంటిదే..
అసలు ఏంటీ శాంతి నికేతన్..? ఎంతో మంది పెద్దలు చెబుతుంటారు.. ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా చూడాలని విశ్వకవి రవీంద్రుని కవితలు చదివిన వారి భావన.. ఎంతో మందికి అందని కలలా నిలిచే ఈ అపురూప ప్రదేశం... నేడు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం భారతీయులందరికి లభించిన వరం...
శాంతినికేతన్ .. శాంతికి.. ఆధ్యాత్మిక వాతావరణానికి.. నాటి గురుకులాలను తలపించేలా.. నేడు విద్యను అందించే అత్యున్నత కేంద్ర విశ్వవిద్యాలయం .. బెంగాల్ రాష్ట్రం.. బిర్భమ్ జిల్లా బోల్ పూర్ లో ఉన్న శాంతినికేతన్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం... రండి...
ఛాతిమ్ లాలా పేరుతో పిలుచుకునే ఈ ప్రాంతాన్ని తొలుత బ్రహ్మచర్య ఆశ్రమాన్ని నిర్వహించేందుక మహార్షి దేవేంద్ర నాథ్ ఠాగూర్ ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రజలు యోగాభ్యాసాన్ని నిర్వహించేందుకు ఈ స్థలాన్ని నిర్దేశించారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ కు శారదాదేవిలకు 14వ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు. సంపన్న కుటుంబంలో పుట్టినా... చిన్ననాటి నుంచి ప్రకృతి మీద... మనసు పారేసుకున్న రవీంద్రుడు.. కథలతోనూ.. కవితలతోనూ కాలక్షేపం చేసేవాడు.. క్రమంగా మాతృభాషపై పెరిగిన ప్రేమ.. చదువుపై కలిగిన ఆసక్తి.. రవీంద్రునిలోని విశ్వమానవుడిని తట్టి లేపాయి.. దీంతో తన తండ్రి స్థాపించిన బ్రహ్మ చర్య ఆశ్రమ స్థానంలో 1901లో ఓ పాఠశాలను స్థాపించారు. చిన్ననాటి నుంచి నాలుగు గోడల మధ్యనే బాల్యాన్ని గడిపిన ఆయన ప్రకృతి ఒడిలో విద్యాభ్యాసం సాగాలనే లక్ష్యంతో బహిరంగ పాఠశాలను... ఏర్పాటు చేశారు. ప్రకృతిలో మమైకమవుతో.. చిన్నారులు వికసించాలని ఆశించాడు.. కాలక్రమంలో ఈ పాఠశాలను విశ్వవిద్యాలయంగా రూపొందించారు. శాంతినికేతన్ లో విద్యాబోధనపై మహాత్మునికి ఎంతో గొప్ప ఉద్దేశం ఉండేది.. జవహర్ లాల్ నెహ్రు 1951లో దీనిని కేంద్ర విశ్వవిద్యాలయంగా రూపొందించడంలో ఎంతగానో పాటుపడ్డారు.
ఎంతో మంది పెద్దలు శాంతినికేతన్ లో చదువుకుని... ప్రముఖులుగా మారారు.. అలాంటి వారిలోతెలుగువారు ఉండడం విశేషం..
ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం పొందిన 41 ప్రదేశం... బెంగాల్ రాష్ట్రంలో ఇది ఐదవది కావడం విశేషం... నోబెల్ అవార్డు గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ .. కలల కళాశాల... నేడు ప్రపంచ సంపదగా మారి.. నోబెల్ గా నిలవడం... భారతీయులందరికి గర్వకారణం.. ప్రపంచ పటంపై రవీంద్రుని మధుర సంతకంగా నేడు శాంతినికేతన్ శాశ్వతంగా నిలిచిపోయింది..
- విరించిక


Nice mam
రిప్లయితొలగించండిRabindranath Tagore gari 'where the mind is without fear' from Geethanjali. Inspires every poet. Keep it up my friend, with the beginning of his name💐
రిప్లయితొలగించండిThank you dear
తొలగించండి